భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్, విండీస్ దిగ్గజం బ్రయాన్ లారా.. నెట్టింట సంభాషించుకున్నారు. ఇది ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందులో సచిన్ ఓ అరుదైన జ్ఞాపకాన్ని షేర్ చేసుకున్నాడు.
సంభాషణ ఇలా...
లారా.. తన కుమారుడు క్రికెట్ ఆడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. "రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌గా ఆడుతున్నా.. బ్యాట్ పట్టుకున్న విధానం చూస్తే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ అవ్వాలనుకుంటున్నాడు" అని లారా పోస్ట్ చేశాడు.
దీనికి స్పందించిన సచిన్.. లారా కుమారుడిలాగే బ్యాట్ పట్టుకున్న చిత్రానికి తన చిన్ననాటి ఫేమస్ ఫొటోను కొలేజ్ చేసి పోస్ట్ చేశాడు సచిన్.