1983 ప్రపంచకప్ ఫైనల్ జరిగి గురువారానికి 37 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ నాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నాడు. ఆ ఫైనల్లో కపిల్‌డెవిల్స్ దిగ్గజ వెస్టిండీస్‌ను 43 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆనాటి ఆటగాళ్లతో పాటు లిటిల్ మాస్టర్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. 1983 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చాలా మంది లాగే తన జీవితంలోనూ కీలక ఘట్టమని ట్వీట్ చేశాడు.
"ఆ రోజు టీమ్‌ఇండియా బౌలర్లు విండీస్ ఆటగాళ్ల వికెట్లు తీయడం నేను, నా స్నేహితులు ఎంతో ఆస్వాదించాం. గార్డన్ గ్రీనిడ్జ్(1) వికెట్ తీసిన సంధూ.. కపిల్‌దేవ్ అందుకున్న అద్భుత క్యాచ్ వరకు అన్నీ చూశాం. ప్రతివికెట్‌కూ మేం ఎగురుతూ ఆనందించాం. అది ఎంతో సంతోషకరమై సాయంత్రం"
సచిన్ తెందూల్కర్, భారత మాజీ క్రికెటర్