తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​లో ఓపెనర్లు వీళ్లే' - బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ

డిసెంబరులో ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్​లో మయాంక్​ అగర్వాల్​, రోహిత్​శర్మ సరైన ఓపెనర్లు అని దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​ అభిప్రాయపడ్డారు. అయితే రోహిత్​ అందుబాటులో లేకపోవడం వల్ల ఆ స్థానంలో పృథ్వీషా లేదా కేఎల్​ రాహుల్​ సరైన ఎంపికని అన్నారు. మరోవైపు చివరి మూడు టెస్టుల్లో కోహ్లీ లేకపోవడం టీమ్​ఇండియాకు తీరని లోటని.. కానీ, యువ ఆటగాళ్లపై తనకు పూర్తి నమ్మకముందని సచిన్​ తెలిపారు.

Sachin Tendulkar names the 'confirmed starter' as India's opener for Australia Tests
'ఆస్ట్రేలియా టెస్టు సిరీస్​లో ఓపెనింగ్​ బ్యాట్స్​మెన్​ వీరే!'

By

Published : Nov 25, 2020, 1:45 PM IST

ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో కీలకమైన బ్యాట్స్​మన్​గా మయాంక్​ అగర్వాల్​ నిలుస్తాడని మాజీ దిగ్గజం సచిన్ తెందూల్కర్​ అభిప్రాయపడ్డారు. మయాంక్ అగర్వాల్​కు ఓపెనింగ్​ భాగస్వామిగా రోహిత్​ శర్మ సరైనవాడని అన్నారు. అయితే తొలి రెండు టెస్టులకు రోహిత్​ శర్మ అందుబాటులో లేకపోవడం వల్ల పృథ్వీషా లేదా కేఎల్ రాహుల్​ను ఓపెనింగ్​కు పంపాలని మాస్టర్​ సూచించారు. వీరిద్దరిలో ఒకరు మయాంక్​కు బ్యాటింగ్​ భాగస్వామిగా బరిలో దిగే అవకాశం ఉందని తెలిపారు.

"ఆస్ట్రేలియాపై మయాంక్​ అగర్వాల్​ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. రోహిత్​ శర్మ అందుబాటులో లేని కారణంగా అతడికి బదులుగా పృథ్వీషా లేదా కేఎల్​ రాహుల్​ సరైన ఎంపిక. ఏదేమైనా జట్టు యాజమాన్యందే తుది నిర్ణయం."

- సచిన్​ తెందూల్కర్​, భారత మాజీ క్రికెటర్​

2018లో అంతర్జాతీయ క్రికెట్​లో అడుగుపెట్టిన మయాంక్​ అగర్వాల్​ ఆస్ట్రేలియాపై మూడు సెంచరీలు చేశాడు. మరోవైపు యువ క్రికెటర్​ శుభ్​మన్​ గిల్​ అద్భుమైన ఓపెనర్​. కానీ, గిల్​ ఇప్పటివరకు టెస్టు క్రికెట్​లో ఆడలేదు. ఆస్ట్రేలియా వంటి ప్రతిష్ఠాత్మక టెస్టు సిరీస్​ తుది జట్టులో.. గిల్​కు అవకాశం లభిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

'నమ్మకం ఉంది..'

ఆస్ట్రేలియాతో 2018-19లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్​లో టీమ్​ఇండియా చారిత్రక విజయాన్ని నెలకొల్పింది. అంతర్జాతీయ క్రికెట్​లో నిషేధం కారణంగా డేవిడ్​ వార్నర్​, స్టీవ్​ స్మిత్​ ఆ సిరీస్​లో పాల్గొనలేదు. వారిద్దరూ ప్రస్తుత సిరీస్​ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు లబుషేన్​ అరంగేట్రం చేసిన ఒకటిన్నర ఏడాదిలోనే మెరుగైన ర్యాంకును సాధించాడు. ఈ ముగ్గుర్ని టీమ్ఇండియా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని సచిన్​ అభిప్రాయపడ్డారు. చివరి మూడు టెస్టులకు కెప్టెన్ విరాట్​ కోహ్లీ అందుబాటులో ఉండకపోవడం టీమ్ఇండియాకు తీరని లోటని.. కానీ, భారత జట్టులోని యువ ఆటగాళ్లపై తనకు నమ్మకం ఉందని మాస్టర్​ బ్లాస్టర్​ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details