క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌కు ప్రత్యేక పురస్కారం లభించింది. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించిన స్వచ్ఛతా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నందుకుగాను 'అత్యంత ప్రభావశీల స్వచ్ఛతా రాయబారి' అవార్డు దక్కించుకున్నాడీ క్రికెటర్. మహాత్మాగాంధీ 150 జయంతిని పురస్కరించుకొని దిల్లీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సచిన్.. ఈ పురస్కారాన్ని స్వీకరించాడు.
మాస్టర్ బ్లాస్టర్‌కు స్వచ్ఛతా పురస్కారం - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించినందుకు 'అత్యంత ప్రభావశీల స్వచ్ఛతా రాయబారి అవార్డు' దక్కించుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్.
మాస్టర్ బ్లాస్టర్‌కు స్వచ్ఛతా పురస్కారం
టీమిండియా తరఫున క్రికెట్లో ఎన్నో మైలురాళ్లు సాధించిన సచిన్.. ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛతా కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ప్రజలకు వాటి గురించి తెలిసేలా చేస్తున్నాడు.
Last Updated : Oct 4, 2019, 8:45 AM IST