కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కావాల్సిన వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తమ సహకారాన్ని అందిస్తున్నారు. ఈ పోరాటంలో భాగంగా రూ.50 లక్షలను తన వంతు విరాళంగా ప్రకటించాడు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్.
"కొవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భాగం కావాలనుకున్నా. అందుకే నా వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.25 లక్షలు విరాళాన్ని ప్రకటిస్తున్నా."
- సచిన్ తెందుల్కర్, టీమిండియా మాజీ క్రికెటర్