దిగ్గజ సచిన్ తెందుల్కర్.. తన ఆప్త మిత్రుడు వినోద్ కాంబ్లీకి ఓ సవాలు విసిరాడు. కేవలం ఏడు రోజుల్లో పూర్తి చేయాలని చెప్పాడు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన కాంబ్లీ.. చెప్పిన సమయానికి పూర్తి చేస్తానన్నాడు.
ఇంతకీ ఆ సవాలేంటి?

బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్‌తో కలిసి సచిన్ 'క్రికెట్ వాలీ బీట్ పే' అనే పాటను గతంలో పాడాడు. ఇప్పుడు ఈ గీతాన్ని ర్యాప్ చేయాలని కాంబ్లీకి ఛాలెంజ్ విసిరాడు సచిన్. ఇందుకు సంబంధించి, వీరిద్దరూ మాట్లాడుతున్న ఓ వీడియోను ట్వీట్ చేశాడు మాస్టర్.
ఈ మాజీ క్రికెటర్ల మధ్య ఉన్న స్నేహ బంధానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. పాఠశాల స్థాయిలో సచిన్-కాంబ్లీ కలిసి 664 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అప్పట్లోనే రికార్డు నెలకొల్పారు.
ఇది చదవండి: వైకల్యాన్ని జయించిన బాలుడు.. సచిన్ మెచ్చిన క్రికెటర్!