తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్​, లారా మళ్లీ బ్యాట్​ పట్టేస్తున్నారోచ్​​

దిగ్గజ క్రికెటర్లు సచిన్​ తెందూల్కర్​, లారా మళ్లీ మైదానంలో సందడి చేయనున్నారు. రోడ్​ సేఫ్టీ వరల్డ్​ సిరీస్​లో భాగంగా ఈ ఇద్దరూ.. తమ బ్యాటింగ్​తో ఆకట్టుకోనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 టీర్నీలో ఈ మాజీలు బరిలోకి దిగనున్నారు.

By

Published : Oct 15, 2019, 9:17 PM IST

Updated : Oct 16, 2019, 1:37 AM IST

సచిన్​, లారా మళ్లీ బ్యాట్​ పట్టేస్తున్నారోచ్​​

భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​, వెస్టిండీస్ దిగ్గజం​ బ్రియాన్​ లారా మళ్లీ మైదానంలో సందడి చేయనున్నారు. రోడ్​ సేఫ్టీ వరల్డ్​ సిరీస్​లో భాగంగా వచ్చే ఏడాది జరగనన్న టీ20 టోర్నీలో వీరిద్దరూ ఆడనున్నారు.

సచిన్​, లారా, బ్రెట్​లీ, సెహ్వాగ్​, దిల్షాన్​, జాంటీ రోడ్స్​

మరింత జోష్​ కోసం...

ఈ టోర్నీలో మొత్తం ఐదు దేశాలు పాలుపంచుకుంటాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్లు మైదానంలో ఆడతారు. సచిన్​, లారాతో పాటు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆస్ట్రేలియా గ్రేట్​ బౌలర్​ బ్రెట్‌లీ, శ్రీలంక ఓపెనర్ దిల్షాన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌ కూడా ఈ టోర్నమెంటులో కనువిందు చేయనున్నారు. వచ్చే ఏడాది భారత్​ వేదికగానే ఫిబ్రవరి 2 నుంచి 16 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.

సచిన్ , సెహ్వాగ్

ఇద్దరూ ఇద్దరే...

46 ఏళ్ల మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్ తెందూల్కర్ టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ అనేక రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో 100 సెంచరీలు సాధించాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2008లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్రియాన్ లారా(11,953) రికార్డుని బద్దలు కొట్టాడు సచిన్​.

2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు లారా. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా లారా పేరిటే రికార్డు ఉంది. 2004లో ఆంటిగ్వా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రియాన్ లారా 400 పరుగులతో అజేయంగా నిలిచి ఈ రికార్డు నెలకొల్పాడు.

Last Updated : Oct 16, 2019, 1:37 AM IST

ABOUT THE AUTHOR

...view details