టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ 2004 ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ టూర్లో నాలుగో టెస్టు మ్యాచ్‌లో 241 పరుగులు చేసి ఆ సిరీస్‌ను ప్రత్యేకంగా మార్చాడు లిటిల్ మాస్టర్. తాజాగా, ఈ సందర్భాన్ని గుర్తుచేసుకున్న సచిన్.. 5 రోజులు జరిగిన టెస్టు మ్యాచ్‌లో బ్రియాన్ ఆడమ్స్ పాడిన 'సమ్మర్ ఆఫ్ 69' పాటను తరచూ వినేవాడినని తెలిపాడు.
" 2004 ఆసీస్ పర్యటనలో సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో 241 పరుగులతో నాటౌట్‌గా నిలిచా. ఆ మ్యాచ్ జరిగిన ఐదు రోజులూ బ్రియాన్ ఆడమ్ పాడిన 'సమ్మర్ ఆఫ్ 69' పాట విపరీతంగా విన్నా. లంచ్ టైం, టీ టైమ్ అని తేడా లేకుండా అన్ని వేళలా ఆ పాటే విన్నా. ఆ ఐదు రోజులు సమ్మర్ ఆఫ్ 69 తప్ప ఇంకేమి ఉండదనిపిస్తుంది"
-సచిన్ తెందుల్కర్, భారత మాజీ బ్యాట్స్‌మన్.