తెలంగాణ

telangana

ETV Bharat / sports

నాలుగు రోజుల టెస్టు నిర్ణయాన్ని తప్పుబట్టిన సచిన్

నాలుగు రోజుల టెస్టు ఆడించాలనే ఐసీసీ ప్రతిపాదనను సచిన్ తెందూల్కర్ వ్యతిరేకించాడు. కొత్త తరాన్ని ఆకర్షించేందుకు ప్రతిదీ మార్చాల్సిన పనిలేదని తెలిపాడు. మంచి పిచ్​లపై దృష్టిసారించాల్సిందిగా మాస్టర్ అభిప్రాయపడ్డాడు.

Sachin opposes 4 day Test Series
సచిన్ తెందూల్కర్

By

Published : Jan 5, 2020, 3:15 PM IST

టెస్టుల నిడివి ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు కుదించాలన్న ఐసీసీ ప్రతిపాదనను వ్యతిరేకించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విరాట్ కోహ్లీ, నాథన్ లియోన్, మెక్​గ్రాత్ లాంటి ఆటగాళ్లు ఇప్పటికే ఈ విధానం పట్ల విముఖత చూపించగా.. తాజాగా సచిన్​ కూడా ఆ జాబితాలో చేరాడు. ఎన్ని ఫార్మాట్లు వచ్చినా.. టెస్టులు క్రికెట్​కు స్వచ్ఛమైన రూపమని అన్నాడు.

"కొత్త తరాన్ని ఆకర్షించడానికి ప్రతిదీ మార్చాల్సిన అవసరం లేదు. ‘‘అయిదో రోజు స్కఫ్డ్‌ బంతితో స్పిన్నర్లు అదరగొట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఇదంతా టెస్టు క్రికెట్‌లో భాగం. స్పిన్నర్లకు ఉన్న ఈ సానుకూలాంశాన్ని తొలిగించాలనుకోవడం న్యాయమేనా? క్రికెట్‌లో వన్డేలు, టీ20లు, టీ10లు, 100 బాల్స్‌ ఫార్మాట్‌లు ఉన్నాయి. కానీ క్రికెట్‌లో సుదీర్ఘ ఫార్మాట్ స్వచ్ఛమైన రూపం. సంప్రదాయమైన ఈ ఫార్మాట్‌ నిడివిని తగ్గించకూడదు" - సచిన్ తెందూల్కర్​

నాణ్యమైన పిచ్​లపై ఐసీసీ దృష్టిసారించాల్సిందిగా మాస్టర్ అభిప్రాయపడ్డాడు.

"మనం వన్డేల్లో .. బౌలర్‌ రివర్స్‌ స్వింగ్‌ వేయడం చివరిగా ఎప్పుడు చూశాం? పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నైపుణ్యం లేదు. ఎందుకంటే మనం రెండు కొత్త బంతుల్ని ఉపయోగిస్తున్నాం. కానీ రివర్స్‌ స్వింగ్‌ బౌలింగ్ చేయాలంటే బంతి మృదువుగా ఉండాలి. ఐసీసీ మంచి నాణ్యమైన పిచ్‌లపై దృష్టి సారించాలనేది నా అభిప్రాయం. బంతితో స్పిన్‌, సీమ్‌, స్వింగ్, బౌన్స్‌ చేయవచ్చు. అది ఆటను బతికిస్తుంది. మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. కుంబ్లే, హర్భజన్‌ వంటి స్పిన్నర్లు నాలుగు రోజుల టెస్టుకు మద్దతు ఇవ్వరని భావిస్తున్నా" -సచిన్ తెందూల్కర్

2023-31 మధ్య కొత్త భవిష్యత్‌ పర్యటనల ప్రణాళికలో పూర్తిగా నాలుగు రోజుల టెస్టులే ఆడించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ విధానాన్ని క్రికెటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇదీ చదవండి: బంగ్లా టెస్టు సిరీస్ ప్రతిపాదనకు పాక్ తిరస్కరణ

ABOUT THE AUTHOR

...view details