తెలంగాణ

telangana

ETV Bharat / sports

పురుషులు ఏడిస్తే బలహీనులు కాదు: సచిన్​ - sachin crying

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం(నవంబర్​ 19) తర్వాత రోజు దిగ్గజ క్రికెటర్​ సచిన్​ ఓ పోస్టు పెట్టాడు. ఇందులో పురుషులకు స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చాడు. ఏడిస్తే బలహీనులైపోరని చెప్పుకొచ్చాడు మాస్టర్​.

పురుషులు ఏడిస్తే బలహీనులు కాదు: సచిన్​ తెందూల్కర్​

By

Published : Nov 21, 2019, 6:56 AM IST

మగాళ్లు ఏడ్చినంత మాత్రాన సిగ్గుపడాల్సిందేమీ లేదని ట్విట్టర్​ వేదికగా లేఖ రాశాడు టీమిండియా దిగ్గజ క్రికెటర్​ సచిన్‌ తెందూల్కర్‌. గతంలో తన అభిప్రాయం అలాగే ఉండేదని పేర్కొన్నాడు. అంతర్జాతీయ పురుషుల వారోత్సవం సందర్భంగా పురుషులందరికీ సచిన్‌ ఓ బహిరంగ లేఖ రాశాడు.

" కన్నీరు కారిస్తే తప్పేం కాదు. నిన్ను బలవంతుడిని చేసే ఒక భాగాన్ని ఎందుకు దాచుకోవాలి? కన్నీళ్లను ఎందుకు దాచాలి? ఎందుకంటే అదే నిజమని నమ్ముతూ మనం పెరిగాం. ఏడుపు మగాళ్లను బలహీనులను చేస్తుందని విశ్వసించాం. ఇదే నిజమని వింటూ నేనూ పెరిగాను. అది తప్పని తెలుసుకున్నాను కాబట్టే ఈ లేఖ రాస్తున్నాను. కష్టాలు, బాధలే నన్ను మెరుగైన వ్యక్తిగా మార్చాయి."

-- సచిన్​ తెందూల్కర్​

ధైర్య ం ఇలానే వస్తుంది..!

బాధను ప్రదర్శించేందుకు చాలా ధైర్యం అవసరమని చెప్పిన మాస్టర్​ బ్లాస్టర్​... కష్టాల నుంచే శక్తిమంతులవుతారని అన్నాడు. అందుకే ఇలాంటి అపోహల నుంచి బయట పడాలని అందరికీ లేఖ రాశాడు.

" భావోద్వేగాలు బయట పెట్టేందుకు ధైర్యం చేయండి. నేనూ ఆందోళన, బాధలు, సందేహాలను ఎదుర్కొన్నాను. ఏడుపొస్తే ఏడవడంలో తప్పులేదు. ఆ తర్వాత మనోధైర్యంతో ఉండాలి. ఎందుకంటే మగాళ్లు చేయాల్సింది అదే. వీడ్కోలు సందేశం ఇచ్చేటప్పుడు నాకు ఏడుపొచ్చింది. ఆఖరి సారి ఔటై పెవిలియన్‌ ఒక్కోమెట్టు ఎక్కుతున్నప్పుడు కుంగిపోతున్నట్టు అనిపించింది. మాటలు రాలేదు. నా బుర్రలో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. నాలో దాచుకోలేకపోయాను. వాటితో పోరాడలేకపోయాను. ఏదేమైనప్పటికీ నేను వాటిని జయించి ముందుకెళ్లినప్పుడు.. ఆశ్చర్యంగా ప్రశాంతత లభించింది. నా కష్టానికి తగిన ఫలితం లభించినందుకు సంతోషంగా అనిపించింది" అని సచిన్‌ ఆ సందేశంలో పేర్కొన్నాడు.

సచిన్​ సందేశం

టీమిండియా తరఫున మొత్తం 664 మ్యాచ్​లు ఆడిన ఈ దిగ్గజం.. 34వేల 357 పరుగులు చేశాడు. ఇందులో 100 శతకాలు, 164 అర్ధశతకాలు, 201 వికెట్లు, 256 క్యాచ్​లు, 2సార్లు ఐదేసి వికెట్లు.. మాస్టర్​ ఖాతాలో ఉన్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details