తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్ దేవుడు 'విరమించి' ఆరేళ్లు.. కేరళలో ప్రత్యేక లైబ్రరీ - malabar christean college

సచిన్ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికి నేటితో ఆరేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కేరళ కాలికట్​లోని 'మలబార్ క్రిస్టియన్ కళాశాల' ఆచార్యుడు వశిష్ట్.. మాస్టర్ బ్లాస్టర్​​కు సంబంధించిన ఓ లైబ్రరీని ఏర్పాటు చేశారు.

సచిన్ లైబ్రరీ

By

Published : Nov 16, 2019, 7:23 AM IST

Updated : Nov 16, 2019, 9:38 AM IST

క్రికెట్ దేవుడు విరమించి ఆరేళ్లు.. కేరళలో ప్రత్యేక లైబ్రరీ

సచిన్ తెందూల్కర్.. ఈ పేరు వింటే సగటు క్రికెట్ అభిమాని రక్తం ఉప్పొంగుతుంది.. ప్రేక్షకుల గుండెల్లో అతడి ఆటతో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న మాస్టర్ రిటైరై ఆరేళ్లు అయింది. ఈ సందర్భంగా క్రికెట్ దేవుడి లైబ్రరీని రూపొందించారు కేరళ కాలికట్​లోని '​మలబార్ క్రిస్టియన్ కళాశాల' చరిత్ర విభాగాధిపతి వశిష్ట్.

జాతీయ సమగ్రత పెంపొందించడం కోసం క్రికెట్​ను ఓ సందేశంలా ప్రచారం చేసేందుకే ఈ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

"మాస్టర్​.. రిటైరై ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా సచిన్ లైబ్రరీని మలబార్ క్రిస్టియన్ కళాశాలలో ఏర్పాటు చేశాం. తన ఆటతో .. దేశాన్ని ఐక్యం చేశాడు. కులం, మతం, భాష, ప్రాంతాల సరిహద్దులను చెరిపేసి అందరి మన్ననలు పొందాడు." -వశిస్ట్, మలబార్​ కళాశాల చరిత్ర విభాగాధిపతి

సచిన్​కు సంబంధించిన 60 పుస్తకాలను ఈ లైబ్రరీలో ఉంచారు. 11 భాషల్లో వీటిని ప్రచురించారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒడియా, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, అసోం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఇవి లభ్యమవుతాయి.

సచిన్ లైబ్రరీ

2013 నవంబరు 16న అంతర్జాతీయ క్రికెట్​కు సచిన్ వీడ్కోలు పలికాడు. టెస్టుల్లో పాకిస్థాన్​పై అరంగేట్రం చేసిన మాస్టర్.. చివరి మ్యాచ్ వెస్టిండీస్​పై ఆడాడు. వాంఖడే స్టేడియంలో (ముంబయి) వెస్టిండీస్​తో జరిగిన ఈ మ్యాచ్​లో 74 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

మొత్తంగా 200 టెస్టులు ఆడిన సచిన్.. 53.78 సగటుతో 15,921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 68 అర్ధ శతకాలు ఉన్నాయి. టెస్టుల్లో మాస్టర్.. వ్యక్తిగత అత్యధిక స్కోరు 248 నాటౌట్‌. బౌలర్​గానూ రాణించి 46 వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్​లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్​గానూ రికార్డు నెలకొల్పాడు.

ఇదీ చదవండి: ఆటగాళ్లను వదులుకున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు

Last Updated : Nov 16, 2019, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details