తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీకి మరపురానిదే కానీ..! - sachin last ODI,virat highest score

2012, మార్చి18 పాకిస్థాన్​పై విరాట్​ కోహ్లీ తన కెరీర్​లో అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు.​ భారత్​ను ఆ మ్యాచ్​లో విజయతీరాలకు చేర్చాడు. అయితే​ సచిన్​ తెందూల్కర్ ఏడేళ్ల క్రితం సరిగ్గా ఈరోజునే తన కెరీర్​లో చివరి వన్డే మ్యాచ్​ ఆడాడు. ఆ తర్వాత 9 నెలలకు పరిమిత ఓవర్ల క్రికెట్​కు వీడ్కోలు పలికాడు.

సచిన్​కు చివరిది...కోహ్లీకి మరపురానిది

By

Published : Mar 18, 2019, 9:41 PM IST

Updated : Mar 19, 2019, 8:16 PM IST

భారత్​-పాకిస్థాన్​ మధ్య ఆసియా కప్​ ఐదో మ్యాచ్​ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్​ చేసిన పాక్​ 6 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు హాఫీజ్​, నసీర్​ జంషెడ్​ సెంచరీలతో చెలరేగారు .

  • లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్​కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గౌతమ్​ను డక్​ ఔట్​ చేసిన మహ్మద్​ హఫీజ్​ భారత్​ను ఒత్తిడిలోకి నెట్టాడు. ​మ్యాచ్​లో సెహ్వాగ్​ లేకపోవడం ఇంకో లోటు. దాంతో ఇంత భారీ స్కోరును టీమిండియా ఛేదించగలదా అనే అనుమానం వచ్చింది.

ఆ సమయంలో సచిన్​కు జతగా కోహ్లీ తోడయ్యాడు..ఇంకేముంది కొండంత లక్ష్యం కరిగిపోయింది.

  1. మ్యాచ్​లో సచిన్​ 48 బంతుల్లో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ కోహ్లీ తనదైన బ్యాటింగ్​తో ఆకట్టుకున్నాడు.
  2. విరాట్​ 148 బంతుల్లో 183 పరుగులు (22 ఫోర్లు, 1 సిక్స్​) చేసి 48 ఓవర్లలోనే మ్యాచ్​ను ముగించాడు. విరాట్​కి రోహిత్​ 68 రన్స్​తో సహకారం అందించాడు. దీంతో 13 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో పాక్​ను మట్టికరిపించింది భారత్​.
  • విశేషమేంటంటే ఇప్పటికీ కోహ్లీ అత్యధిక స్కోరు ఇదే. కోహ్లీ 183 పరుగుల స్కోరును చేయడం ఓ మధుర జ్ఞాపకంగా గుర్తిండిపోయింది క్రికెట్​ అభిమానులకు. అయితే ఈ మ్యాచ్​ తర్వాత వన్డేల్లో సచిన్​ బ్యాట్​ పట్టుకోకపోవడం బాధ కలిగించే విషయం.
Last Updated : Mar 19, 2019, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details