తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ కెప్టెన్సీపై నెటిజన్ల ఫైర్.. రోహిత్​కు మద్దతు​' - rohit sharma

వెస్టిండీస్​ పర్యటన కోసం టీమిండియా ఆటగాళ్ల ఎంపిక పూర్తయింది. మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీనే సారథిగా కొనసాగిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. 'పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్.. కోహ్లీ కంటే గొప్ప సారథి' అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

విరాట్

By

Published : Jul 22, 2019, 5:11 AM IST

ప్రపంచకప్​ సెమీఫైనల్లో​ ఓటమి తర్వాత జరగబోయే వెస్టిండీస్ పర్యటన కోసం టీమిండియా జట్టును ప్రకటించింది సెలక్షన్ కమిటీ. కెప్టెన్సీలో మార్పు జరుగుతుందని అందరూ భావించారు. వరల్డ్​కప్ ఓటమి తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీ కంటే రోహిత్ మంచి కెప్టెన్ అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నెటిజన్లు. ప్రస్తుతం ఎంపికైన జట్టుకు మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీనే సారథిగా ప్రకటించారు సెలక్టర్లు. ఈ విషయమై నెటిజన్లు తమ అభిప్రాయాల్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు.

ప్రపంచకప్​ ఓటమి తర్వాత రోహిత్-కోహ్లీ మధ్య విభేదాలు వచ్చాయని కొన్ని ఊహాగానాలు వినిపించాయి. విండీస్ పర్యటనలో విరాట్​కు విశ్రాంతినిచ్చి రోహిత్​కు కెప్టెన్సీ ఇస్తారన్న వార్తలూ వినిపించాయి. అలా ఏం జరగలేదు. ఈ కారణంగా బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుపై కౌంటర్​లు వేస్తున్నారు నెటిజన్లు. 'సచిన్​ గొప్ప బ్యాట్స్​మెన్​ కానీ గొప్ప కెప్టెన్​ కాదు' అంటూ కోహ్లీపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరికొందరు పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీ కంటే రోహిత్ గొప్ప సారథి అని అంటున్నారు. రోహిత్​కు మద్దతుగా నిలుస్తూ.. సారథి విరాట్​కు వ్యతిరేకంగా పోస్ట్​లు పెడుతున్నారు.

నెటిజన్ల ట్వీట్స్​

ఇవీ చూడండి.. WC19: 'పొరపాటు నాదే.. కానీ చింతించడం లేదు'

ABOUT THE AUTHOR

...view details