టీమ్‌ఇండియా దిగ్గజం సచిన్ తెందూల్కర్‌కు సెంచరీలను డబుల్, ట్రిపుల్ శతకాలుగా మలచడం తెలియదని మరో దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్ అభిప్రాయపడ్డాడు. "సచిన్ అపారమైన ప్రతిభావంతుడు. అతడి లాంటి ఆటగాడిని ఇప్పటి వరకు చూడలేదు. సెంచరీలు ఎలా చేయాలో అతడికి బాగా తెలుసు. శతకాలను 200, 300లుగా మార్చడం మాత్రం అతడికి తెలియదు. సచిన్ స్థాయికి కనీసం ఐదు ట్రిపుల్.. 10 డబుల్ సెంచరీలు చేయాల్సింది. ముంబయి ఆటగాళ్ల మనస్తత్వం భిన్నంగా ఉంటుంది. సెంచరీ పూర్తవగానే మళ్లీ సున్నా నుంచి మొదలుపెడతారు. ముంబయికి చెందిన సచిన్ కూడా అంతే. అక్కడే నేను వ్యతిరేకించేవాడిని. బౌలర్లు భయపడేలా కనికరం లేని బ్యాట్స్‌మన్‌గా మారిపోవాలి. కాని సెంచరీ సాధించగానే సింగిల్స్ తీసేవాడు. నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడేవాడు కాదు" అని కపిల్ వివరించాడు.
'సచిన్ స్థాయికి ఐదు ట్రిపుల్ సెంచరీలు చేయాల్సింది'
టీమ్‌ఇండియా దిగ్గజం సచిన్ తెందూల్కర్‌కు సెంచరీలను డబుల్ , ట్రిపుల్ శతకాలుగా మార్చడం తెలియదని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్. మాస్టర్ సెంచరీ చేయగానే సింగిల్స్ తీసేవాడని తెలిపాడు.
'సచిన్ స్థాయికి ఐదు ట్రిపుల్ సెంచరీలు చేయాల్సింది'
వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేసిన సచిన్.. టెస్టుల్లో ఆరు ద్విశతకాలు రాబట్టాడు. క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.