మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్.. హైదరాబాద్‌లో జరిగిన ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ 25వ వార్షికోత్సవానికి హాజరయ్యాడు. ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా క్రికెట్, వైద్యానికి సంబంధించిన పలు అంశాలపై స్పందించాడు.
టీనేజర్‌గా మొట్టమొదటిసారి భారత్ కోసం ఆడిన తొలి మ్యాచ్‌ను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు సచిన్. పాకిస్థాన్‌లో జరిగిన ఈ మ్యాచ్ సమయంలో తాను కొంత ఒత్తిడికి గురయ్యాయని, అయితే ఒత్తిడి మనిషిపై ఎప్పుడు ఉండాలని మాస్టర్ తెలిపాడు. దానిని పాజిటివ్‌గా తీసుకుంటే ఎలాంటి విజయాన్నయినా సాధించవచ్చన్నాడు. అదే ఒత్తిడి మనల్ని బాధించేలా ఉంటే తప్పక వదిలించుకోవాలని సూచించాడు.