సచిన్ తెందూల్కర్ - వినోద్ కాంబ్లీ పాఠశాల నుంచి ఇప్పటివరకు ప్రాణస్నేహితులనే విషయం చాలా మందికి తెలుసు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇద్దరూ కలిసి సందడి చేశారు. క్రికెట్ వీడియో గేమ్ ఆడుతూ స్నేహానికి హద్దుల్లేవు అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
మాస్టర్ బ్లాస్టర్‌ను క్రికెట్లో ఓడించానని కాంబ్లీ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశాడు.
అనంతరం కాసేపటికే సచిన్ మరో వీడియో పెట్టాడు. ఇంతకు ముందు మ్యాచ్ రికార్డు కాలేదని, ఇప్పుడు చూద్దామంటూ వినోద్ కాంబ్లీకి సవాల్ విసిరాడు.
కాసేపటికే ఇద్దరూ కలిసి క్రికెట్ వీడియో గేమ్ ఆడుతున్న వీడియో పోస్ట్ చేశాడు సచిన్. చిన్నపిల్లల్లా మారి గేమ్ ఆడుతూ కనిపించారు. ఈ మ్యాచ్ టైగా ముగుస్తుంది. మరి సూపర్ ఓవర్ ఏదని కాంబ్లీ అడుగుతాడు. ఇందులో సూపర్ ఓవర్ ఉండదని... ఎందుకంటే ఫ్రెండ్షిప్లో బౌండరీలు ఉండవని తెలిపాడు మాస్టర్.
బౌండరీ కౌంట్ ద్వారా ప్రపంచకప్ విజేతగా నిలిచింది ఇంగ్లాండ్. ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాడు సచిన్ తెందూల్కర్. అర్థం చేసుకున్న వారికి ఇది సరిపోద్దనుకుంటా అని స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు సచిన్.
ఇది చదవండి: రష్యా బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు మూడు పతకాలు