దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన తొలి వన్డే కరోనా కారణంగా వాయిదా పడింది. ఓ సఫారీ క్రికెటర్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరుదేశాల బోర్డులు సంయుక్త ప్రకటన చేశాయి. అయితే ఆ ఆటగాడు ఎవరనేది మాత్రం చెప్పలేదు. ఈ మ్యాచ్‌ను ఆదివారం నిర్వహించనున్నట్లు తెలిపారు.
మిగతా రెండు వన్డేలను డిసెంబరు 7, 9 తేదీల్లో జరపనున్నట్లు దక్షిణాఫ్రికా బోర్డు వెల్లడించింది. ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో ఇంగ్లాండ్ గెలుచుకుంది.