వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రూ రసెల్ బ్యాటింగ్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున అలరించేందుకు సిద్ధమయ్యాడీ స్టార్ బ్యాట్స్‌మన్. అయితే, ఫ్రాంచైజీ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్.. రసెల్‌ను ఈ సారి బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో దింపే ఆలోచనలో ఉన్నట్లు కేకేఆర్ మెంటార్ డేవిడ్ హస్సీ తెలిపాడు.
గత సీజన్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా ఎంపికైన రసెల్.. తన నిర్ణయాలతో రెండుసార్లు జట్టు ట్రోఫీ కోల్పోయేందుకు కారణమయ్యాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో యూఏఈలో జరిగే లీగ్‌లో అతడిని మూడో స్థానంలో దింపే ఆలోచనలు చేస్తున్నట్లు హస్సీ చెప్పడం ఆసక్తి రేపుతోంది.