తెలంగాణ

telangana

ETV Bharat / sports

విండీస్ ఆల్​రౌండర్ రసెల్​కు​ గాయం​..! - St Lucia Zouks

కరీబియన్​ ప్రీమియర్​ లీగ్​(సీపీఎల్​)లో వెస్టిండీస్​ ఆల్​రౌండర్​ ఆండ్రీ రసెల్​ గాయపడ్డాడు. సఫారీ బౌలర్​ విల్​జోన్​ వేసిన బంతి ఎదుర్కొనే క్రమంలో తలకు దెబ్బతగిలింది. జమైకా తల్వాస్​,​ లూసియా జౌక్స్​ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

సఫారీ బౌలర్​ చేతిలో రసెల్​కు దెబ్బ

By

Published : Sep 13, 2019, 12:25 PM IST

Updated : Sep 30, 2019, 10:47 AM IST

ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లోజమైకా తల్వాస్‌కు సారథ్యం వహిస్తున్న క్రికెటర్​ ఆండ్రీ రసెల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. సెయింట్‌ లూసియా జౌక్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్​లో... విల్​జోన్​ వేసిన బంతిని హిట్‌ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యడు. ఆ బంతి రసెల్‌ హెల్మెట్‌ వెనుక భాగంలో బలంగా తాకింది. అతడి కుడి చెవికి గాయమవగా, నొప్పి తట్టుకోలేక మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రాథమిక చికిత్స అందించిన వైద్యబృందం.. ఆస్పత్రికి తరలించారు.

ఈ మ్యాచ్‌లో సెయింట్‌ లూసియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​కు దిగిన జమైకా తల్వాస్​ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. లక్ష్యాన్ని 16.4 ఓవర్లలోనే ఛేదించింది లూసియా. 30 బంతుల్లో 75 పరుగులతో చేసి ఆకట్టుకున్నభారీకాయుడు కార్న్​వాల్​(లూసియా).. 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్' అవార్డు​ అందుకున్నాడు.

ఇదీ చదవండి...

Last Updated : Sep 30, 2019, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details