ప్రస్తుత క్రికెట్‌లో ఆండ్రూ రసెల్‌ను మించిన అత్యుత్తమ ఆల్‌రౌండర్ ఎవరూ లేరని అంటున్నాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు రింకూసింగ్. రసెల్ కంటే బంతిని బలంగా బాదేవారు ఎవరూ లేరని.. అతడికి చాలా శక్తి ఉందన్నాడు. సిక్సర్లు కొట్టడంలో ఇప్పడు అతడితో పోటీ పడగలిగే ఆటగాడిని తాను చూడలేదని చెప్పాడు. ప్రపంచంలో ప్రస్తుతం అతడే అత్యుత్తమ ఆల్‌రౌండర్ అన్నా డు.
"నేను రసెల్‌తో ఎక్కువగా మాట్లాడలేదు. నాకు ఇంగ్లీషులో మాట్లాడటం అంతగా రాదు. కానీ ఓసారి అతడి పుట్టినరోజు సమయంలో మా గదిలో అందరం కలిసి సంబరాలు చేసుకున్నాం. డ్యాన్సులు చేశాం. అప్పటి నుంచే మా మధ్య స్నేహం పెరిగింది. నేను కోల్‌కతా జట్టుకు ఆడటాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నా. ఈ అనుభవం చాలా గొప్ప అనుభూతిని ఇస్తోంది. చాలా విషయాలు నేర్చుకున్నా. లెజండరీ క్రికెటర్లతో ఆడగలిగే అవకాశం నాకు దక్కింది. మ్యాచ్‌లో ఎలా వ్యవహరించాలన్న పరిణతీ పెరిగింది."