ఐపీఎల్లో తమ ఆటగాడు బెన్ స్టోక్స్ ఆడటంపై ఇంకా స్పష్టత లేదని రాజస్థాన్ రాయల్స్ కోచ్ మెక్‌డొనాల్డ్ చెప్పాడు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ స్టోక్స్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కాన్సర్‌తో బాధపడుతున్న తన తండ్రి వద్ద ఉన్నాడని వెల్లడించాడు.
ఐపీఎల్ 2020: బెన్ స్టోక్స్ ఆడటం కష్టమే! - రాజస్థాన్ రాయల్స్ కోచ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఆడే విషయమై ఇంకా స్పష్టత లేదని ఆ జట్టు కోచ్ మెక్‌డొనాల్డ్ అన్నాడు. న్యూజిలాండ్‌లో కాన్సర్ చికిత్స పొందుతున్న తన తండ్రి వద్ద ఉన్నాడని.. అతడికి అవసరమైనంత సమయాన్ని ఇస్తున్నామని తెలిపాడు.
![ఐపీఎల్ 2020: బెన్ స్టోక్స్ ఆడటం కష్టమే! RR coach McDonald says 'not sure' about Stokes' availability](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8816833-702-8816833-1600222336610.jpg)
ప్రస్తుత ఐపీఎల్లో బెన్ స్టోక్స్ ఆటడం కష్టమే!
"స్టోక్స్ కుటుంబం గురించే మా చింత. ఇవి చాలా క్లిష్ట పరిస్థితులు. అతడికి అవసరమైనంత సమయం ఇస్తున్నాం. ఐపీఎల్లో అతడు ఆడటం గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను" అని మెక్‌డొనాల్డ్ అన్నాడు. పాకిస్థాన్‌తో తొలి టెస్టు తర్వాత స్టోక్స్ మళ్లీ క్రికెట్ ఆటలేదు.
యూఏఈ వేదికగా ఈనెల 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ జరగనుంది. టోర్నీలోని తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనున్నాయి.