ఆడిన పది మ్యాచ్‌ల్లో ఆరింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది దిల్లీ క్యాపిటల్స్. మూడింటిలో మినహా మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడి దిగువ నుంచి రెండో స్థానంలో ఉంది రాజస్థాన్. ఈ రెండింటి మధ్య జైపూర్ వేదికగా నేడు మ్యాచ్ జరగనుంది.
రహానే నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్న స్టీవ్ స్మిత్ ఘనమైన విజయాన్ని సాధించాడు. ముంబయిపై జరగిన మ్యాచ్‌లో అర్ధశతకంతో అటు బ్యాటింగ్‌లోనూ మెప్పించాడు. మరోవైపు సొంతగడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన దిల్లీ శనివారం పంజాబ్‌ని మట్టికరిపించింది.
రాజస్థాన్ రాయల్స్...
గత మ్యాచ్‌లో ముంబయిపై గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది రాజస్థాన్. 161 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. రియాన్ పరాగ్ 43 పరుగులతో సత్తాచాటగా, సంజూ శాంసన్ ఆకట్టుకున్నాడు. ఓపెనర్ అజింక్యా రహానే ఫామ్‌లోకి రావాల్సి ఉంది. బౌలర్లలో శ్రేయాస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్ నిలకడగా రాణిస్తున్నారు. ఇప్పటికే ఆరింటిలో ఓడిపోయిన రాజస్థాన్ ప్లే ఆఫ్ చేరాలంటే ప్రతీ మ్యాచ్‌లోనూ గెలవాల్సిందే. సొంతగడ్డపై మ్యాచ్ జరగనుండటం రాయల్స్‌కు కలిసొచ్చే అంశం. ఈ సీజన్లో దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 182 పరుగుల లక్ష్య ఛేదనలో చతికిలపడింది రాజస్థాన్. సొంతగడ్డపై జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.