తెలంగాణ

telangana

ETV Bharat / sports

బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ - rohit sharma

ముంబయి ఇండియన్స్​తో సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్​లో టాస్ గెలిచి.. బౌలింగ్​ ఎంచుకుంది బెంగళూరు రాయల్​ ఛాలెంజర్స్​.

ఐపీఎల్

By

Published : Mar 28, 2019, 7:41 PM IST

తొలి మ్యాచ్​లో ఓడి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నాయి ముంబయి ఇండియన్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్లు. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు కెప్టెన్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్​ మధ్య పోరు కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

బెంగళూరు జట్టు మొదటి మ్యాచ్​లో బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమైంది. బ్యాటింగ్​లో పార్థివ్ మినహా మరే బ్యాట్స్​మెన్ రెండంకెల స్కోరు సాధించలేదు. బౌలింగ్​లో చాహల్, ఉమేష్, సిరాజ్, శివమ్ దూబే సత్తా చాటాల్సి ఉంది.

మరోవైపు ముంబయి పరిస్థితి కూడా అలాగే ఉంది. తొలి మ్యాచ్​లో యువరాజ్ మినహా ఏ బ్యాట్స్​మెన్​ అంతగా రాణించలేదు. మలింగ తుది జట్టులోకి రావడం వల్ల ముంబయి బౌలింగ్​ మరింత పటిష్ఠంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details