ఐపీఎల్ 13వ సీజన్ కోసం అప్పుడే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి ఫ్రాంచైజీలు. మార్చి 29 నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ మెగాటోర్నీ ముంగిట తమ జట్టు లోగో మార్చుతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ). సింహం బొమ్మతో కూడిన ఆ లోగో.. ధైర్యమైన, నిర్భయమైన జట్టు వ్యక్తిత్వాన్ని చాటుతుందని యాజమాన్యం పేర్కొంది. తాజాగా దీనిపై కౌంటర్ వేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.
మూడోసారైనా మారేనా..?
ఆర్సీబీ ఫ్రాంచైజీ తాజాగా లోగోను మూడోసారి మార్పు చేసింది. "మీరు ఎదురు చూసిన క్షణం ఇదే. కొత్త ఆర్సీబీ.. కొత్త దశాబ్దం.. కొత్త లోగో" అని పేర్కొంది. లోగోతో పాటు ఆ జట్టు జెర్సీ డిజైన్‌ను కూడా మార్చినట్లు తెలిపింది. అయితే ట్వీట్‌పై కౌంటర్ వేసిన సన్‌రైజర్స్.. "ఈ సారి లోగో చాలా బాగుంది. ఆరెంజ్ ఆర్మీ బోల్డ్‌గా ఆడేందుకు ఈ సీజన్లోనూ సిద్ధంగా ఉండండి" అంటూ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్‌ల ఫోటోను పోస్ట్ చేసింది.