తెలంగాణ

telangana

ETV Bharat / sports

రొటేషన్ పద్ధతి మంచిదే: కోహ్లీ - rotation policy

క్రికెట్ అంతా బయోబబుల్​లో నడుస్తున్న ప్రస్తుత సమయంలో రొటేషన్​ విధానం ఉత్తమమని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత భారత పర్యటనలో రొటేషన్ విధానాన్ని అనుసరిస్తున్న ఇంగ్లాండ్​పై కెవిన్​ పీటర్సన్ సహా మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కోహ్లీ మాత్రం నిత్యం బయోబబుల్​లో ఉంటున్న ఆటగాళ్లకు విరామం మంచిదేనని అంటున్నాడు.

Rotation policy is good: Kohli
రొటేషన్ పద్ధతి మంచిదే: కోహ్లీ

By

Published : Mar 4, 2021, 6:41 AM IST

బయోబబుల్‌ వాతావరణంలో ఆటగాళ్లు మానసికంగా అలసిపోకుండా ఉండేందుకు రొటేషన్‌ పద్ధతి అవసరమని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. కరోనా వల్ల ఆటగాళ్ళు బయో-బబుల్‌ వాతావరణంలో ఆడుతున్నంత కాలం..... అడపాదడపా విరామం తీసుకోవడం చెడ్డ ఆలోచన కాదన్నాడు. నాలుగో టెస్టుకు ముందు పాత్రికేయులతో వర్చువల్‌గా సమావేశమైన కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

రొటేషన్ పద్ధతి అమలు చేసేందుకు రిజర్వ్‌ బెంచ్‌ బలంగా ఉండాలని, టీమిండియా బెంచ్‌ చాలా బలంగా ఉందన్నాడు కోహ్లీ. స్పిన్‌ పిచ్‌లపై జరుగుతున్న వివాదంపై స్పందించిన అతడు.. చాలామంది కేవలం వీటినే విమర్శిస్తారని ఎద్దేవా చేశాడు. పేస్‌ పిచ్‌పై ఓ జట్టు తక్కువ పరుగులకే ఆలౌట్‌ అయితే ఎవరూ మాట్లాడరని ఆరోపించాడు.

ఇదీ చూడండి:'స్పిన్​ పిచ్​లపై అంత రాద్ధాంతం ఎందుకు?'

ABOUT THE AUTHOR

...view details