తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్రపంచకప్​ ఫైనల్​ను జీవితంలో​ మరోసారి చూడను' - final

ఈ ఏడాది ప్రపంచ​కప్ ఫైనల్​ను జీవితంలో మరోసారి చూడాలనుకోవట్లేదని చెప్పాడు కివీస్ ఆటగాడు రాస్ టేలర్. ఈ మ్యాచ్ అనేక భావోద్వేగాలతో ముడిపడిందని తెలిపాడు. తుదిపోరులో న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది ఇంగ్లాండ్.

రాస్ టేలర్

By

Published : Jul 30, 2019, 12:09 PM IST

ప్రపంచకప్ - 2019 న్యూజిలాండ్​కు చేదు జ్ఞాపకంగా మిగిలింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి వరకు పోరాడి త్రుటిలో కప్​ చేజార్చుకుంది విలియమ్సన్​ సేన​​. ఈ ఓటమిపై కివీస్ ఆటగాడు రాస్ టేలర్ స్పందించాడు. ఫైనల్ మ్యాచ్​ను జీవితంలో మరోసారి చూడాలనుకోవట్లేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

"ఇంగ్లాండ్​తో జరిగిన వరల్డ్​కప్ ఫైనల్​ను మళ్లీ ఎప్పుడూ చూడాలనుకోవట్లేదు. మ్యాచ్​ ఆద్యంతం అనేక ఆటుపోట్లు, భావోద్వేగాలతో సాగింది. కొన్ని సార్లు మేమూ.... ఇంకొన్ని సార్లు ఇంగ్లాండ్​ పైచేయి సాధించింది. ఫలితాన్ని కొంతమంది ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు - రాస్ టేలర్​, కివీస్ ఆటగాడు"

ఫైనల్​ మ్యాచ్​లో సూపర్ ఓవర్​ ఉంటుందని తాను అనుకోలేదని చెప్పాడు రాస్ టేలర్.

"50 ఓవర్లు అయిపోగానే మ్యాచ్ టై అయింది. నేను అంపైర్ల దగ్గరికి వెళ్లి కరచాలనం చేయబోతున్నా. సూపర్ ఓవర్ ఉందని వాళ్లు అప్పుడు చెప్పారు. నేను ఇంతకు ముందు సూపర్ ఓవర్ ఆడలేదు. సాధారణంగా టీ 20ల్లో సూపర్ ఓవర్ ఉంటుంది" - రాస్ టేలర్, కివీస్ ఆటగాడు.

ప్రపంచకప్​ ఫైనల్లో తొలి సారిగా సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇంగ్లాండ్​ - న్యూజిలాండ్ మధ్య జరిగిన తుదిపోరులో మ్యాచ్ టైగా ముగియడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సూపర్ ఓవర్లోనూ స్కోరు టై అయింది. ఈ కారణంగా బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్​ను విజేతగా ప్రకటించారు.

ఇది చదవండి: 29 ఏళ్ల క్రితమే టెస్టుల్లో కపిల్ సిక్సర్ల రికార్డు

ABOUT THE AUTHOR

...view details