తెలంగాణ

telangana

ETV Bharat / sports

వచ్చే టీ20 ప్రపంచకప్​కు టేలర్ కష్టమే! - రాస్​ టేలర్​ తాజా వార్తలు

న్యూజిలాండ్​ జట్టులో కీలక క్రికెటర్​గా ఉన్న రాస్​ టేలర్.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఆడేది కష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడే కచ్చితంగా ఏం చెప్పలేనని అన్నాడు.

Ross Taylor 'not sure' about playing 2021 T20 World Cup in India
రాస్​ టేలర్

By

Published : Aug 12, 2020, 9:31 AM IST

వచ్చే ఏడాది భారత్​లో జరిగే టీ20 ప్రపంచకప్​లో న్యూజిలాండ్​ మాజీ కెప్టెన్​, ప్రముఖ​ బ్యాట్స్​మన్​ రాస్​ టేలర్ ఆడటంపై సందిగ్దత నెలకొంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయమై స్పందిస్తూ ఇప్పుడే తాను కచ్చితంగా చెప్పలేనని అన్నాడు.

ఈ ఏడాది ప్రారంభంలో 100వ అంతర్జాతీయ టీ20 ఆడి, ఈ ఘనత సాధించిన తొలి కివీస్​ క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం కరీబియన్​ ప్రీమియర్​ లీగ్​(సీపీఎల్​) ఆడేందుకు సిద్ధమయ్యాడు.

కరోనా మహమ్మారి వల్ల చాలాకాలం క్రికెట్​కు దూరం కావడం గురించి టేలర్​ మాట్లాడాడు. "పాఠశాల చదివే రోజుల నుంచి క్రికెట్​ ఆడకుండా ఇంతకాలం ఎప్పుడూ ఉండలేదు. ఐసోలేషన్​, తదితర విషయాలన్నీ కాస్త కొత్తగానే ఉన్నాయి. ఈ సారి సీపీఎల్​ కూడా కాస్త భిన్నంగా ఉండనుంది. ఐదు నెలలకు పైగా ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్​కు దూరంగా ఉన్నారు. కాబట్టి, ప్రస్తుతం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మరోవైపు ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్​లు జరగనున్నాయి. కానీ, మమ్మల్ని ప్రోత్సహించడం కోసం వారంతా ఇళ్లలో టీవీ ముందు కూర్చుని ఉంటారని మాకు తెలుసు. ప్రస్తుత పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఇవన్నీ అలవాటు చేసుకోవాలి" అని​ చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details