వెల్లింగ్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌కు చాలా ప్రత్యేకం. క్రికెట్ చరిత్రలోనే మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా ఈ మ్యాచ్ ద్వారా చరిత్ర సృష్టించాడీ ఆటగాడు. ఈ టెస్టులో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టేలర్‌కు అభిమానులు చప్పట్లతో స్వాగతం పలికారు. అయితే అరుదైన మ్యాచ్‌లో.. కెరీర్లో మరో అర్ధశతకం చేసే అవకాశం కోల్పోయాడు. 44 రన్స్(71 బంతుల్లో; 6 ఫోర్లు, 1 సిక్సర్) చేసి పెవిలియన్ చేరాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పుజారా చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
భారత్‌పైనే రెండో ఘనత...
ఇటీవల భారత్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్ ద్వారా వందో టీ20 మ్యాచ్ పూర్తి చేసుకున్నాడు టేలర్. తాజాగా టెస్టు మ్యాచ్‌లోనూ ఇదే ఫీట్ సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో 231 మ్యాచ్‌లు ఆడిన టేలర్.. మూడు ఫార్మాట్లలో వంద మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. టేలర్ 2007లో టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు సుదీర్ఘ ఫార్మాట్‌లో 19 శతకాలు, 33 అర్ధశతకాలు బాదాడు. 3 డబుల్ సెంచరీలు ఖాతాలో ఉన్నాయి.
ప్రస్తుతం టేలర్... కివీస్ తరఫున వన్డేలు, టెస్టుల్లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. వన్డేల్లో 7219 పరుగులు చేసిన అతడు... టెస్టుల్లో మొత్తం 8565 పరుగులు చేశాడు. మాజీ సారథి బ్రెండన్ మెక్‌కలమ్, మార్టిన్ గప్తిల్ మాత్రం పొట్టి క్రికెట్‌లో టేలర్ కన్నా ఎక్కువ పరుగులు చేశారు. ఈ ఫార్మాట్‌లో కేవలం 1909 రన్స్ చేశాడు రాస్.