తెలంగాణ

telangana

By

Published : Jan 6, 2020, 2:44 PM IST

ETV Bharat / sports

ఫ్లెమింగ్ రికార్డు బ్రేక్ చేసిన రాస్ టేలర్

న్యూజిలాండ్ బ్యాట్స్​మన్ రాస్ టేలర్.. టెస్టుల్లో ఆ దేశం తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించాడు. 7,174 పరుగులతో ఫ్లెమింగ్​ను అధిగమించాడు.

Ross Taylor becomes New Zealand's leading Test run-getter
రాస్ టేలర్

న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ అరుదైన ఘనత సాధించాడు. ఆ దేశం తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 99 టెస్టుల్లో 46.28 సగటుతో 7,174 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో 19 శతకాలు 33 అర్ధసెంచరీలు ఉన్నాయి. సిడ్నీ వేదికగా ఆసీస్​తో జరిగిన మూడో టెస్టులో ఈ ఘనత సాధించాడు.

అంతకుముందు ఈ రికార్డు కివీస్ మాజీ సారథి స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరిట ఉండేది. అతడు 111 టెస్టుల్లో 7,172 పరుగులు చేశాడు.

ఆసీస్​తో జరిగిన మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో రాస్ టేలర్ కివీస్ తరఫున రెండో అత్యుత్తమ స్కోరు చేసిన బ్యాట్స్​మన్​గా నిలిచాడు. ఆరు ఇన్నింగ్స్​ల్లో 80, 22, 4, 2, 22, 22 పరుగులు చేశాడు. గత ఫిబ్రవరిలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన కివీస్ బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 17,250 పరుగులు చేశాడు టేలర్. ఇందులో 39 శతాకాలు, 88 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా​తో జరిగిన మూడో టెస్టులో న్యూజిలాండ్ 279 పరుగుల తేడాతో ఓడింది. ఫలితంగా 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది ఆసీస్​. తొలి ఇన్నింగ్స్​లో ద్విశతకంతో చెలరేగిన లబుషేన్​కు​ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్​ అవార్డులు వచ్చాయి.

ఇదీ చదవండి: మూడో టెస్టులో కివీస్​పై ఆసీస్ విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్

ABOUT THE AUTHOR

...view details