భారత్‌తో ఐదో టీ20 ఆడుతున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ మరో ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో 100 మ్యాచ్‌లాడిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. తమ దేశం తరఫున ఈ రికార్డు సాధించిన తొలి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.
ఆ ఘనత సాధించిన తొలి కివీస్ క్రికెటర్ రాస్ టేలర్ - cricket news
పొట్టి ఫార్మాట్లో 100 మ్యాచ్‌లాడిన తొలి కివీస్ క్రికెటర్‌గా నిలిచాడు రాస్ టేలర్. భారత్‌తో జరుగుతున్న ఐదో టీ20లో పాల్గొని ఈ ఘనత సాధించాడు.
![ఆ ఘనత సాధించిన తొలి కివీస్ క్రికెటర్ రాస్ టేలర్ ross taylor became third cricketer completed 100 T20I matches](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5929372-336-5929372-1580628679218.jpg)
కివీస్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్
టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లాడిన క్రికెటర్ పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ మాలిక్(113). రెండో స్థానంలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ(107) ఉన్నాడు. వీరిద్దరి తర్వాత స్థానం సొంతం చేసుకున్నాడు రాస్ టేలర్. అఫ్రిది(99), ధోనీ(98).. నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
Last Updated : Feb 28, 2020, 9:28 PM IST