న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్.. అ దేశ క్రికెట్ అత్యున్నత పురస్కారం అందుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచి, సర్ రిచర్డ్ హ్యాడ్లీ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తన పదేళ్ల కెరీర్లో టేలర్.. ఈ మెడల్ అందుకోవడం ఇది మూడోసారి. కరోనా ప్రభావంతో వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమం ద్వారా హ్యాడ్లీ ఈ పతకాన్ని ప్రదానం చేశారు.
టేలర్‌కు న్యూజిలాండ్ అత్యుత్తమ క్రికెట్ పురస్కారం
స్టార్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్.. 2019-20 సీజన్‌కుగాను ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవడం సహా కివీస్ అత్యున్నత క్రికెట్ పురస్కారం అందుకున్నాడు.
కివీస్ బ్యాట్స్‌మన్ రాసే టేలర్
ఈ సీజన్లో రాణించి, కివీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను అధిగమించాడు. అలానే మూడు ఫార్మాట్లలో కలిపి 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా నిలిచాడు. అయితే గతేడాది ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయని, ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోవడం బాధించిందని చెప్పాడు.