విచిత్రమైన బౌలింగ్ యాక్షన్‌తో రొమేనియాకు చెందిన క్రికెటర్ అంతర్జాలంలో సంచలనం రేపుతున్నాడు. నెమ్మదిగా పరిగిత్తుకుంటూ వచ్చి.. బంతిని స్లోగా పైకి విసిరి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నాడు. యూరొపియన్ క్రికెట్ లీగ్‌లో క్లజ్, డ్రూక్స్ క్రికెట్ క్లబ్‌ల మధ్య జరిగిన టీ-10 మ్యాచ్‌లో పావెల్ ఫ్లోరిన్ అనే బౌలర్ విచిత్ర బౌలింగ్ శైలితో ఆకట్టుకున్నాడు.
బంతిని సులభంగా షాట్ ఆడొచ్చు అని అంచనా వేసిన బ్యాట్స్‌మెన్‌ను కంగారుపెడుతున్నాడు పావెల్ ఫ్లోరిన్. అతడి బౌలింగ్‌లో బౌండరీ కొట్టేందుకు కూడా బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం తన బౌలింగ్ యాక్షన్‌తో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాడు పావెల్.