ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు కెప్టెన్ కోహ్లీ, పరిమిత ఓవర్ల సిరీస్కు రోహిత్ శర్మ దూరమవ్వడం టీమ్ఇండియాకు పూడ్చలేని లోటని ఆసీస్ స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు ప్రత్యర్థి జట్టులో ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉన్నారని చెప్పాడు.
"చాలా ఏళ్ల నుంచి పరిమిత ఓవర్ల సిరీస్లో, టాప్ఆర్డర్లో రోహిత్ తానేంటో నిరూపించుకున్నాడు. కాబట్టి ఈసారి అతడు లేకపోవడం జట్టుకు లోటు. కానీ ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు టీమ్ఇండియాలో చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్లో మయాంక్, కేఎల్ రాహుల్ టాప్ ఆర్డర్లో అద్భుతంగా ఆడారు. కాబట్టి హిట్మ్యాన్ లోటును తీర్చేందుకు చాలా మార్గాలు ఉన్నాయని భావిస్తున్నాను. కోహ్లీ గొప్ప ఆటగాడు. చాలాకాలం నుంచి అన్ని ఫార్మాట్లలో బాగా ఆకట్టుకుంటున్నాడు. టెస్టులకు అతడు దూరమవ్వడం జట్టుపై ప్రభావం చూపుతుంది"
-స్మిత్, ఆసీస్ క్రికెటర్
బాల్ ట్యాంపరింగ్ కారణంగా 2018-19 భారత్-ఆసీస్ బోర్డర్-గావస్కర్ సిరీస్కు స్మిత్ దూరమయ్యాడు. అయితే ఈసారి జరగబోయే సిరీస్లో మాత్రం తాను అదరగొట్టాలని అనుకుంటున్నట్లు స్మిత్ చెప్పాడు. ఇరుజట్ల మధ్య ఈ సిరీస్ హోరాహోరీగా సాగుతుందని అన్నాడు.
రోహిత్ అనుమానమే