తెలంగాణ

telangana

ETV Bharat / sports

చాహల్​కు రోహిత్​శర్మ భార్య అదిరిపోయే పంచ్​ - Ritika Sajdeh's Hilarious Reply After Yuzvendra Chahal twee

భారత బౌలర్ యజ్వేంద్ర చాహల్​కు టీమిండియా ఓపెనర్​ రోహిత్​ శర్మతో చనువు ఎక్కువ. అయితే ఇటీవలే జరిగిన ఇన్​స్టా సంభాషణలో ఈ బౌలర్​కు అదిరిపోయే కౌంటర్​ ఇచ్చింది హిట్​మ్యాన్​ భార్య రితిక.

చాహల్​కు రోహిత్​శర్మ భార్య అదిరిపోయే పంచ్​

By

Published : Sep 22, 2019, 4:59 PM IST

Updated : Oct 1, 2019, 2:25 PM IST

టీమిండియా బౌలర్​ యజ్వేంద్ర చాహల్​ సామాజిక మాధ్యమాల్లో ఫుల్​జోష్​గా ఉంటాడు. తోటి ఆటగాళ్లతో కలిసి డ్యాన్స్​లు వేస్తుంటాడు. వారిని ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ఆ వీడియోలను పంచుకుంటూ ఉంటాడు. కాకపోతే ఈ బౌలర్​కు ఓపెనర్​ రోహిత్‌ శర్మతో మరింత స్నేహం ఉంది. హిట్​మ్యాన్​ కుటుంబంతో చాలా చనువుగా ఉంటాడు. అయితే ఈ మధ్య జరిగిన ఇన్​స్టా సంభాషణలో ఈ యువ బౌలర్​కు దిమ్మ తిరిగే కౌంటర్​ ఇచ్చిందిరోహిత్​ భార్య రితిక.

దక్షిణాఫ్రికాతో మూడో టీ20 కోసం బెంగళూరు వెళ్లాడు రోహిత్​శర్మ. అక్కడ తన భర్తను కలిసిన రితిక... ఓ సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో పంచుకంది. "మళ్లీ కలిశాం" అంటూ ఓ వ్యాఖ్య జోడించింది. ఈ ఫొటోపై స్పందించిన చాహల్.​. "వదినా... అందులో నన్నెందుకు కట్‌ చేశారు" అని సరదాగా ప్రశ్నించాడు.

నెట్టింట చాహల్​ ప్రశ్న

చాహల్​ ప్రశ్నకు ఊహించని కౌంటర్​ ఇచ్చింది రితిక. "నువ్వు ప్రస్తుతం భారత జట్టులో లేవు కదా. అందుకే నిన్ను కట్‌ చేశా" అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సంభాషణ వైరల్​ అవుతోంది.

గతంలోనూ ఓ సారి ఇలానే ట్వీట్​ చేశాడుచాహల్​. "రోహిత్‌ నిన్ను బాగా మిస్‌ అవుతున్నా" అని అన్నాడు. వెంటనే స్పందించిన రితిక "ప్రస్తుతం రోహిత్‌ నా మనిషి" అంటూ సమాధానమిచ్చింది.

బెంగళూరు వేదికగా సఫారీలతో చివరి టీ20 ఆడనుంది కోహ్లీ సేన. ఇప్పటికే ఈ సిరీస్​లో 1-0 ఆధిక్యంతో ఉంది టీమిండియా.

Last Updated : Oct 1, 2019, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details