తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండు టోర్నీలపై రోహిత్​ ఆసక్తి.. అవేంటంటే?

లాక్​డౌన్​ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్​, టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ రెండింట్లో ఏ టోర్నీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారన్న అభిమానుల ప్రశ్నకు.. రెండింట్లోనూ అడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు టీమ్​ ఇండియా వైస్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ.

Rohit wants to play both T20 World Cup and IPL
ఆ రెండు టోర్నీలూ ఆడేందుకు రోహిత్​ ఆసక్తి

By

Published : Jun 14, 2020, 6:58 PM IST

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​, ఐపీఎల్​ రెండు టోర్నీల్లోనూ ఆడాలనుకుంటున్నట్లు టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్ రోహిత్​ శర్మ తెలిపాడు. కరోనా కారణంగా రెండు టోర్నీల్లో ఏదో ఒకటి మాత్రమే నిర్వహించే అవకాశాలున్న నేపథ్యంలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు రోహిత్​. లాక్​డౌన్​ వేళ అభిమానులను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పలకరించిన రోహిత్​.. ఈ ఏడాది ఏ టోర్నీకి ప్రాధాన్యత ఇస్తారని ఓ అభిమాని ప్రశ్నించగా.. రెండింట్లోనూ ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు.

అస్ట్రేలియాలో అక్టోబరు-నవంబరులో జరగాల్సిన ప్రపంచకప్​పై ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు, బీసీసీఐ ఐపీఎల్​ను నిరవధిక వాయిదా వేసింది. ఒకవేళ టీ20 ప్రపంచకప్​ వాయిదా వేస్తే ఐపీఎల్​ను నిర్వహించే సూచనలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఐపీఎల్​లో రోహిత్​ కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్​​ ఇప్పటికే నాలుగుసార్లు ఛాపింయన్​గా నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details