తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్ శర్మ మూడో టెస్టులో ఆడతాడా లేదా? - kohli rohit sharma

హిట్​ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టు జట్టుతో కలుస్తాడు కానీ మూడో టెస్టులో ఆడేది మాత్రం సందేహంగానే కనిపిస్తోంది. ఈ విషయమై మేనేజ్​మెంట్ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడమే ఇందుకు కారణం.

Rohit to join team, but place in India XI not guaranteed: Shastri
రోహిత్ శర్మ మూడో టెస్టులో ఆడతాడా?

By

Published : Dec 29, 2020, 3:23 PM IST

టీమ్​ఇండియా ఆటగాడు రోహిత్ శర్మ, జట్టుతో బుధవారం(డిసెంబరు 30) కలుస్తాడని కోచ్ రవిశాస్త్రి చెప్పాడు. అతడితే ఇప్పటికే మాట్లాడామని అన్నాడు. అయితే మూడో టెస్టులో హిట్​మ్యాన్ ఆడే విషయమై మేనేజ్​మెంట్ స్పష్టత ఇవ్వలేకపోతోంది.

"రోహిత్ రేపు జట్టుతో కలుస్తాడు. గత కొన్ని రోజులుగా క్వారంటైన్​లో ఉన్నాడు కాబట్టి అతడితో ముందుగా మాట్లాడి, ఆ తర్వాత తుదినిర్ణయం తీసుకుంటాం" -రవిశాస్త్రి, టీమ్​ఇండియా కోచ్

తొడ కండర గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ.. సిడ్నీలో గత కొన్ని రోజుల నుంచి క్వారంటైన్​లో ఉన్నాడు. జనవరి 7 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టు కోసం జట్టులో అవకాశమిస్తారో లేదో చూడాలి. సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మెల్​బోర్న్​లోనే మూడో టెస్టు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మెల్​బోర్న్​లో జరిగిన బాక్సింగ్​ డే టెస్టులో భారత్ జట్టు అద్భుత విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. తాత్కాలిక కెప్టెన్​ రహానె ప్లేయర్​ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచి, జానీ ముల్లా పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details