తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్ నా రోల్ మోడల్: పాక్ యువ క్రికెటర్ - pakisthan young cricketer role model rohit sharma

పాకిస్థాన్ యువ క్రికెటర్​ హైదర్​ అలీ.. టీమ్​ఇండియా క్రికెటర్​ రోహిత్​ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్​ తన రోల్​ మోడల్​ అని, జట్టులో అతని ప్రదర్శన అద్భుతమని తెలిపాడు.

Rohit Sharma's "Aggressive Style" Inspires Pakistan's Haider Ali
పాక్​ యువ క్రికెటర్​కు స్ఫూర్తినిచ్చిన రోహిత్​ శర్మ

By

Published : Jun 19, 2020, 12:33 PM IST

టీమ్​ఇండియా క్రికెటర్​ రోహిత్​ శర్మ తన రోల్​ మోడల్​ అని పాకిస్థాన్ యువ క్రికెటర్​ హైదర్​ అలీ స్పష్టం చేశాడు. జట్టుకు ఓపెనర్​గా రోహిత్​ చేసే ప్రదర్శన అద్భుతమని కొనియాడాడు. ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో రాజకీయ పరంగా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నప్పటికీ.. ఇటువంటి ప్రశంసలు రావడం గమనార్హం.

"టెస్టు, వన్డే, టీ20 ఇలా ఏ ఫార్మాట్ అయినా సరే.. రోహిత్​ ఒక ఆలోచనతో వచ్చి ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడతాడు. నేను కూడా పాక్​ జట్టుకు ఓపెనర్​గా అటువంటి ఆరంభాన్నే ఇవ్వాలనుకుంటున్నా."

-హైదర్​ అలీ, పాక్​ క్రికెటర్​

రాబోయే ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లనున్న 29 మంది సభ్యుల పాకిస్థాన్​ జట్టులో హైదర్​ కూడా ఉన్నాడు. ముంబయిలో 2008లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్​, పాకిస్థాన్ మధ్య మ్యాచ్​లు నిలిచిపోయాయి. అయితే దాయాది జట్టు అప్పుడప్పుడు బహుళ జట్టు టోర్నీల్లో భారత్​తో తలపడుతుంటుంది.

ABOUT THE AUTHOR

...view details