ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో తనకు ఆడాలనుందని అంటున్నాడు టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇలా చెప్పాడు.
"గతంలోని ఆటగాళ్లతో ఆడే అవకాశం వస్తే మీరు ఎవరితో ఆడాలనుకుంటున్నారు?" అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. "మెక్‌గ్రాత్ బౌలింగ్‌ను ఎదుర్కొవాలనుకుంటున్నాను" అని వీడియో ద్వారా ట్విట్టర్లో సమాధానమిచ్చాడు రోహిత్.
టెస్టుల్లో అత్యధికంగా వికెట్లు
మెక్‌గ్రాత్.. ఆసీస్ తరఫున 124 టెస్టులాడి, 563 వికెట్లను పడగొట్టడాడు. వన్డేల్లో 381 వికెట్లు తీశాడు. 2007 ప్రపంచకప్ తర్వాత ఆటకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.