మైదానంలో ప్రత్యర్థులపై బ్యాట్‌తో విరుచుకుపడే రోహిత్‌శర్మ.. సహచరులపై అంతే సరదాగా పంచులు విసురుతుంటాడు. ఆస్ట్రేలియాపై తాజాగా సిరీస్ గెల్చిన తర్వాత, చాహల్ షర్ట్ లేని ఫొటో షేర్ చేశాడు. ఇందులో ఈ బౌలర్‌ను హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్‌తో పోల్చాడు.
"ఈ రోజు నేను చూసిన ఫొటోల్లో ఇదే అత్యుత్తమం. భారత్ సిరీస్ గెలిచినా ఒక్కరు మాత్రం వార్తల్లో నిలిచారు. బ్రావో!" అని ట్వీట్ చేశాడు రోహిత్. దీనికి 'ద రాక్' అని స్పందించాడు చాహల్. గతంలో ఇదే తరహా ఫొటోను షేర్ చేసిన రోహిత్... చాహల్ కండలపై సరదాగా కామెంట్ చేశాడు.
టాప్-2లో రోహిత్
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో .. టీమిండియా 7 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ 119 పరుగులతో చెలరేగాడు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'నూ అందుకున్నాడు.
>> ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తర్వాత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన ర్యాంక్‌ను పటిష్టం చేసుకున్నాడు. 868 పాయింట్లతో రోహిత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
>> వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్‌గా రోహిత్‌శర్మ (29) రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో సచిన్ తెందూల్కర్ (49), కోహ్లీ (43), రికీ పాంటింగ్ (30) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అయిదో స్థానంలో సనత్ జయసూర్య (28) ఉన్నాడు.
>> వన్డేల్లో అత్యంత వేగంగా తొమ్మిది వేల పరుగుల మైలురాయిని సాధించిన మూడో క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ (217) నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లీ (194), డివిలియర్స్ (208) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రోహిత్ తర్వాతి స్థానాల్లో గంగూలీ (228), సచిన్ (235), లారా (239) ఉన్నారు.
>> వన్డేల్లో అత్యధిక శతక భాగస్వామ్యాలు సాధించిన మూడో జోడిగా రోహిత్-కోహ్లీ (18) నిలిచారు. ఈ జాబితాలో సచిన్-గంగూలీ (26), దిల్షాన్-సంగక్కర (20) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.