టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యాడు. శనివారం చాహల్, ధనశ్రీలకు రోకా వేడుక జరిగింది. దానికి సంబంధించిన ఫొటోను చాహల్ తన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. దీనిపై స్పందించిన పలువురు క్రికెటర్లు చాహల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
చాహల్ 2050లో ఎలా ఉంటాడో తెలుసా! - Yuzvendra Chahal engagement to Dhanashree Verma
టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మతో తాజాగా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ క్రమంలో చాహల్‌కు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అందరి కంటే భిన్నంగా విషెస్ చెప్పాడు.
వీరందరి కంటే భిన్నంగా చాహల్‌కు శుభాకాంక్షలు తెలిపాడు టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ. "ఐపీఎల్ 2050లో యువకుడితో ఉన్న యుజ్వేంద్ర చాహల్" అనే ట్యాగ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. దీంతోపాటు చాహల్‌కు శుభాకాంక్షలు తెలిపాడు రోహిత్. అందులో ఉన్న వృద్ధుడి ముఖం చాహల్‌ను పోలి ఉంది. ఈ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు స్మైలీ ఎమోజీలను రిప్లేగా ఇచ్చారు.
యూఏఈలో జరగబోయే ఐపీఎల్ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తరఫున చాహల్ ఆడనున్నాడు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు 53 రోజుల పాటు సాగనుంది. చాహల్ చివరగా ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కనిపించాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 52 వన్డేలు, 42 టీ20లు ఆడి.. రెండు ఫార్మాట్లలో కలిపి 146 వికెట్లు సాధించాడు.