తెలంగాణ

telangana

ETV Bharat / sports

రికార్డుకు మరో అడుగు దూరంలో రోహిత్​శర్మ - INDIA-WEST INDIES

టీమిండియా బ్యాట్స్​మన్ రోహిత్​శర్మ... మరో సిక్స్​ కొడితే అన్ని ఫార్మాట్లలో కలిపి 400 సిక్స్​లు కొట్టిన తొలి భారత క్రికెటర్​గా నిలుస్తాడు.​ ఈ శుక్రవారం వెస్టిండీస్​తో కోహ్లీసేన తొలి టీ20లో తలపడనుంది.

రికార్డుకు మరో అడుగు దూరంలో రోహిత్​శర్మ
టీమిండియా బ్యాట్స్​మన్ రోహిత్​శర్మ

By

Published : Dec 5, 2019, 5:16 AM IST

భారత స్టార్ ఓపెనర్​ రోహిత్​శర్మ.. వెస్టిండీస్​తో టీ20 సిరీస్​కు సన్నద్ధమవుతున్నాడు. ఓ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్న హిట్​మ్యాన్.. ఓ సిక్స్​ కొడితే అన్ని ఫార్మాట్లలో కలిపి 400 సిక్స్​లు కొట్టిన తొలి టీమిండియా క్రికెటర్​గా నిలుస్తాడు. ప్రస్తుతం 399 సిక్స్​లతో ఉన్నాడు. ఇతడి కంటే ముందు '400' క్లబ్​లో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్​ అఫ్రిది(476), విండీస్​ విధ్వంసకర గేల్(576) ఉన్నారు.

రోహిత్ వన్డేల్లో 232, టెస్టుల్లో 52, టీ20ల్లో 115 సిక్స్​లు కొట్టాడు. ఈ ఏడాది 67 సిక్స్​లు కొట్టి, అంతర్జాతీయ క్రికెట్​లో మిగతా క్రికెటర్​ల కంటే ముందున్నాడు. గత రెండేళ్లలో వరుసగా 2017లో 65, 2018లో 74 సిక్స్​లు కొట్టాడు.

టీమిండియా బ్యాట్స్​మన్ రోహిత్​శర్మ

వెస్టిండీస్​తో టీ20 సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్​ హైదరాబాద్​లో ఈ శుక్రవారం జరగనుంది. బంగ్లాదేశ్​ సిరీస్​కు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. మోకాలి గాయం కారణంగా దూరమైన ధావన్ స్థానంలో సంజూ శాంసన్​ చోటు దక్కించుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details