తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముంబయి వీధుల్లో రోహిత్​ ప్రత్యక్షం.. ఎందుకంటే? - రోహిత్​ శర్మ

టీమ్​ఇండియా క్రికెటర్​ రోహిత్​ శర్మ.. ముంబయిలో పర్యాటక ప్రదేశంగా పేరొందిన అలీబాగ్​ ప్రాంతంలో కనిపించాడు. అక్కడ ఆస్తిని కొనుగోలు చేయడానికి వచ్చినట్లు సమాచారం.

rohith
రోహిత్​

By

Published : Dec 8, 2020, 2:37 PM IST

ప్రస్తుతం బెంగళూరు ఎన్​సీఏలోని శిక్షణా శిబిరంలో ఉన్న టీమ్​ఇండియా క్రికెటర్​ రోహిత్​ శర్మ.. తాజాగా ముంబయిలోని తీర ప్రాంతమైన అలీబాగ్​లో దర్శనమిచ్చాడు. హిట్​మ్యాన్​ను చూసిన జనం ఫొటోల కోసం ప్రయత్నించారు. ఆ ప్రాంతంలో ఆస్తిని కొనుగోలు చేయడానికి వచ్చినట్లు తెలిసింది. ఆ ప్రాంతాన్ని సందర్శించాక రోహిత్​ మళ్లీ ఎన్​సీఏకు వెళ్లిపోయాడు.

అలీబాగ్.. ముంబయిలో ఓ పర్యాటక ప్రదేశం. అక్కడే చాలా మంది సెలబ్రిటీలు తమ ఫామ్​ హౌస్​లను నిర్మించుకున్నారు. లాక్​డౌన్​లో టీమ్​ఇండియా సారథి కోహ్లీ, తన భార్య అనుష్క శర్మ కూడా ఆ ప్రాంతంలోని ఫామ్​ హౌస్​లోనే గడిపారు.

ఇప్పటికే ఫిట్​నెస్​ లేమితో ఆసీస్​తో జరిగే టెస్టు సిరీస్​లోని తొలి రెండు మ్యాచులకు దూరమైన రోహిత్​.. చివరి రెండు మ్యాచుల్లో పాల్గొంటాడా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత లేదు.

ఇదీ చూడండి : భారత్​ ఆట తీరుపై రోహిత్ శర్మ స్పందన

ABOUT THE AUTHOR

...view details