తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​శర్మ ఖాతాలో అరుదైన రికార్డు - India vs South Africa:

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున ఒక టెస్టులో అత్యధిక సిక్సులు బాదిన క్రికెటర్​గా నిలిచాడు.

రోహిత్

By

Published : Oct 5, 2019, 2:03 PM IST

టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున ఒక టెస్టు మ్యాచ్​లో అత్యధిక సిక్సులు (9) కొట్టిన ఆటగాడిగా ఘనత సాధించాడు. విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో ఈ రికార్డు సృష్టించాడు.

ఇంతకుముందు నవజ్యోత్ సింగ్ సిద్ధు (8) పేరిట ఈ రికార్డు ఉండేది. మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా), వీరేంద్ర సెహ్వాగ్ (భారత్), హర్భజన్ సింగ్ (భారత్), అజింక్య రహానే (భారత్) ఏడు సిక్సులతో తర్వాతి స్థానంలో ఉన్నారు.

తొలిసారి టెస్టుల్లో ఓపెనర్​గా వచ్చిన రోహిత్.. తొలి ఇన్నింగ్స్​లో 176 పరుగులతో సత్తాచాటాడు. రెండో ఇన్నింగ్స్​లోనూ ఇప్పటికే అర్ధశతకం పూర్తి చేసి ఆకట్టుకుంటున్నాడు.

ఇప్పటికే వన్డే (16), టీ20 (10) మ్యాచ్​ల్లోను భారత్ తరఫున అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు రోహిత్.

ఇవీ చూడండి.. క్రికెటర్ పాండ్యకు శస్త్ర చికిత్స విజయవంతం

ABOUT THE AUTHOR

...view details