తెలంగాణ

telangana

ETV Bharat / sports

దాతలకు రోహిత్​ శర్మ సంతకంతో ప్రశంసాపత్రాలు - వీవీఎస్​ లక్ష్మణ్​

క్రికెట్​ సంఘం వ్యవస్థావక దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది 'క్రికెట్​ అసోసియేషన్​ ఆఫ్​ బంగాల్'​. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాతలకు రోహిత్​ శర్మ సంతకంతో ప్రశంసాపత్రాలను అందజేసింది.

Rohit Sharma signed certificates for CAB blood donors
దాతలకు రోహిత్​ శర్మ సంతకంతో ప్రశంసాపత్రాలు

By

Published : Jan 31, 2020, 3:41 AM IST

Updated : Feb 28, 2020, 2:51 PM IST

'క్రికెట్​ అసోసియేషన్​ ఆఫ్​ బంగాల్'​ స్థాపించి 90 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆదివారం రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాతలకు టీమిండియా ఆటగాడు రోహిత్​శర్మ పేరుతో ప్రశంసపత్రాలను అందచేసింది బంగాల్​ క్రికెట్​సంఘం. గతంలో రాహుల్​ ద్రవిడ్​, యువరాజ్​సింగ్​, వీవీఎస్​ లక్ష్మణ్​ సంతకం చేసిన ప్రశంసాపత్రాలను అందజేశారు.స్థాపన దినాన్ని పురస్కరించుకొని బంగాల్​ క్రికెట్​ బోర్డు ప్రెసిడెంట్​, ఛైర్మన్​ బోర్డు ట్రస్టీస్​ జట్ల మధ్య ప్రదర్శన మ్యాచ్​ జరిగింది. సర్ ఫ్రాంక్ వొరెల్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని వరుసగా 40 వ సంవత్సరం నిర్వహిస్తున్నారు.ఇందులో పాల్గొన్న దాతలకు బ్యాడ్జ్‌లు మరియు స్వాష్‌బక్లింగ్ బ్యాట్స్ మాన్ సంతకం చేసిన గౌరవ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు.

1981 నుంచి ఫిబ్రవరి 3 న బంగాల్​ క్రికెట్​ సంఘం వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆచరిస్తూ.. 1962 లో బార్బడోస్ టెస్ట్‌లో జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంటూ వొరెల్‌కు అంకితం చేసిన రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. భారత కెప్టెన్ నారి కాంట్రాక్టర్, చార్లీ గ్రిఫిత్​ వేసిన బౌన్సర్‌ తాకి గాయపడ్డాడు. ఆ సమయంలో రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చిన వొరెల్ ప్రేరణతో, తీవ్రంగా గాయపడిన కాంట్రాక్టర్ కోసం భారత్, వెస్టిండీస్ క్రికెటర్లూ రక్తదానం చేశారు.

ఇది చూడండి...కోహ్లీ-రోహిత్​తో దోబూచులాడుతున్న​ రికార్డు

Last Updated : Feb 28, 2020, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details