తెలంగాణ

telangana

ETV Bharat / sports

లారా విందుకు టీమిండియా ఆటగాళ్లు - bravo

విండీస్ దిగ్గజ క్రికెటర్ లారా ఇచ్చిన విందులో పాల్గొన్నారు టీమిండియా ఆటగాళ్లు. ఈ ఫొటోలను కరీబియన్ క్రికెటర్ బ్రావో ఇన్​స్టాలో పంచుకున్నాడు.

బ్రావో

By

Published : Aug 17, 2019, 7:19 PM IST

Updated : Sep 27, 2019, 7:54 AM IST

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు వీలు దొరికినప్పుడల్లా వివిధ ప్రదేశాలు సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా కరీబియన్ దిగ్గజ క్రికెటర్​ లారా ఇంటికి వెళ్లిన ఈ ఆటగాళ్లు డిన్నర్​లో పాల్గొని సరదాగా గడిపారు. ఈ చిత్రాలను బ్రావో ఇన్​స్టాలో షేర్ చేశాడు.

టీ20, వన్డే సిరీస్​లను గెలుచుకున్న టీమిండియాకు కాస్త విరామం దొరికింది. టెస్టుల కోసం నెట్స్​లో చెమట చిందించిన ఆటగాళ్లు... లారా ఇచ్చిన డిన్నర్​లో పాల్గొన్నారు. విండీస్​ క్రికెటర్లతో పాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, చాహల్​ పాల్గొని సందడి చేశారు.

ఈ విందులో పాల్గొన్న విండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో భారత ఆటగాళ్లతో ఉన్న ఫొటోలను ఇన్​స్టాలో పంచుకున్నాడు.

లారాతో విండీస్ ఆటగాళ్లు
"మాకు తన ఆతిథ్యం ఇచ్చినందుకు లారాకు కృతజ్ఞతలు. నా తోటి ఆటగాళ్లు, భారత క్రికెట్ జట్టు సోదరులతో కలవడం ఎప్పుడూ బాగుంటుంది" అని ఇన్​స్టాలో రాసుకొచ్చాడు.
టెస్టు జట్టులో చోటు దక్కని ధావన్​.. ఈ విందులో పాల్గొన్నాడు. లారాతో దిగిన ఫొటోను ఇన్​స్టాలో షేర్ చేశాడు.

ఆగస్టు 22న భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్​తో టెస్టు ఛాంపియన్ షిప్​ను ప్రారంభించనున్నాయి ఇరుజట్లు.

ఇవీ చూడండి.. యాషెస్​లో స్మిత్​ ఆట​పై అదిరే సెటైర్లు

Last Updated : Sep 27, 2019, 7:54 AM IST

ABOUT THE AUTHOR

...view details