టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీతో తనను పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డాడు ఓపెనర్ రోహిత్ శర్మ. అసలు మహీలా మరెవ్వరూ ఉండరని పేర్కొన్నాడు. భారత జట్టులో హిట్‌మ్యానే తర్వాతి ధోనీ అన్న సురేశ్ రైనా మాటలు విన్నానని వెల్లడించాడు. ఎవరికి వారు భిన్నంగా ఉంటారని తెలిపాడు.
"టీమ్‌ఇండియా తర్వాతి ధోనీ అతడే (రోహిత్)నని నేను కచ్చితంగా చెప్పగలను" అని ది సూపర్‌ఓవర్ పొడ్‌కాస్ట్‌లో రైనా అన్నాడు. "నేను అతడిని పరిశీలించాను. ప్రశాంతంగా ఉంటాడు. అందరి మాటా వింటాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతాడు. జట్టును ముందుండి నడుపుతాడు. ఎప్పుడైతే కెప్టెన్ జట్టును ముందుండి నడుపుతూ డ్రెస్సింగ్ రూమ్‌లో అందరినీ గౌరవిస్తాడో అప్పడతనికి అన్నీ దొరుకుతాయి" అని రైనా వెల్లడించాడు.