కరోనా ప్రభావంతో సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇప్పటికే టోర్నీలు, షూటింగ్‌లు అన్ని బంద్ అయిపోయాయి. ఐపీఎల్ వచ్చే నెల 15కు వాయిదా పడింది. ఈ క్రమంలో ఇంట్లోనే ఉన్న టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ.. కూతురు సమైరాతో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఆ వీడియోను ఇన్‌స్టా పోస్ట్ చేశాడు.
సమైరా కోసం ప్రత్యేకంగా కొన్న బ్యాట్‌తో, ఆ చిన్నారికి బ్యాటింగ్ నేర్పిస్తున్నాడు రోహిత్. క్రికెట్ బంతి బదులుగా ఫుట్‌బాల్‌ను ఇందుకోసం ఉపయోగించారు.