కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. నిస్వార్థంగా వ్యవహరిస్తూ.. జట్టులో అందర్నీ సమానంగా చూస్తాడు. తాజాగా, ముంబయి ఇండియన్స్ జట్టులో తనను అతి తక్కువ ముఖ్యమైన ఆటగాడిగా చెప్పుకున్నాడు. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
సెప్టెంబరు 19నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలోనే లీగ్‌లో తలపడేందుకు తమ జట్టును సంసిద్ధం చేస్తున్నాడు రోహిత్.
"మనం ఒక కెప్టెన్ స్థానంలో ఉంటే.. జట్టులో అందరికన్నా తక్కువ ముఖ్యమైన వ్యక్తిగా భావించాలని నా సిద్ధాంతం. మిగిలిన వారు అనేక విషయాల్లో చాలా ముఖ్యమైన వ్యక్తులు. ఇది ఒక్కో కెప్టెన్‌కు ఒక్కోలాగా వర్తిస్తుంది. నాకు మాత్రం ఈ సిద్ధాంతం పాటించడం ఇష్టం."