ప్రముఖ భారత క్రికెటర్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కే అవకాశం ఉంది. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు (2020)కు.. ఇతడి పేరును సిఫార్సు చేసింది బీసీసీఐ. అర్జున అవార్డులకు శిఖర్ ధావన్, ఇషాంత్‌శర్మ, దీప్తి శర్మల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపింది.
క్రీడల్లో అత్యున్నత పురస్కారానికి రోహిత్‌శర్మ నామినేట్
భారత క్రికెటర్ రోహిత్‌శర్మ పేరును ఖేల్‌రత్నకు సిఫార్సు చేసింది బీసీసీఐ. అతడితో పాటు అర్జున అవార్డులకు శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ సహా మహిళా ప్లేయర్ దీప్తి శర్మ పేర్లతో కూడిన జాబితాను కేంద్రానికి పంపింది.
క్రీడల్లో అత్యున్నత పురస్కారానికి రోహిత్‌శర్మ నామినేట్
ఇవీ గణాంకాలు..
- ప్రస్తుతం టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మ వైస్ కెప్టెన్. క్రీజులో నిలిస్తే విధ్వంసం సృష్టించే హిట్‌మ్యాన్ 2019 ఏడాదికి గాను ఐసీసీ వన్డే క్రికెట్ పురస్కారం అందుకున్నాడు. ఒక ప్రపంచకప్ టోర్నీలో ఐదు శతకాలు బాదేసిన ఏకైక క్రికెటర్ ఘనత అతడి సొంతం. టీ20ల్లో నాలుగు శతకాలు, టెస్టు ఓపెనర్‌గా అరంగేట్రంలోనే రెండు శతకాలు బాదిన తొలి క్రికెటర్ హిట్‌మ్యానే.
- అరంగేట్రంలోనే అత్యంత వేగవంతమైన టెస్టు శతకం చేసిన రికార్డు శిఖర్ ధావన్‌కు ఉంది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో వరుసగా రెండుసార్లు గోల్డెన్ బ్యాట్ పురస్కారం అందుకున్న ఒకే ఒక్కడు గబ్బర్. వన్డేల్లో అత్యంత వేగంగా 2000, 3000 పరుగులు చేసిన టీమ్‌ఇండియా ఆటగాడిగా ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 4000, 5000 పరుగులు చేసిన భారత రెండో క్రికెటర్ సైతం ఇతడే.
- అత్యంత పిన్న వయసులోనే టీమ్‌ఇండియా తరఫున మూడు ఫార్మాట్లలో ఆడిన క్రికెటర్‌గా ఇషాంత్ శర్మకు రికార్డు ఉంది. ఆసియా బయట అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్ లంబూ పేరిట రికార్డు ఉంది.
- మహిళల క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారతీయ క్రికెటర్‌గా దీప్తిశర్మ రికార్డు సృష్టించింది. తన ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టుకు అపురూప విజయాలు అందించింది.
ఇదీ చూడండి: ఖేల్‌రత్నకు అంజుమ్.. ద్రోణాచార్యకు రాణా నామినేట్!
Last Updated : May 30, 2020, 8:00 PM IST