కరోనా లాక్‌డౌన్‌తో ఆటలన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే పలు దేశాలు క్రీడల నిర్వహణకు సన్నద్ధమవుతున్నాయి. మరోవైపు భారత్‌లో జరగాల్సిన ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. దీంతో ఆటగాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లో లైవ్‌సెషన్లు నిర్వహించి అభిమానులను అలరించారు. ఈ సందర్భంగా పలువురు ఆటగాళ్లు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అందులో టీమ్‌ఇండియా ఓపెనర్ రోహిత్‌శర్మ ఒకడు. తాజాగా, హిట్‌మ్యాన్ ఓ విషయాన్ని మిస్సవుతున్నట్లు చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తాజాగా ఓ వీడియోను పంచుకున్నాడు. లాక్‌డౌన్ వల్ల సిక్సుల మోత మోగించడం కుదరట్లేదని రాసుకొచ్చాడు.
2 నిమిషాల్లో రోహిత్ శర్మ 26 సిక్సులు - రోహిత్‌శర్మ తాజా వార్తలు
లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉన్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. సిక్సుల కొట్టడాన్ని చాలా మిస్సవుతున్నట్లు చెప్పాడు. తనకు సంబంధించిన ఓ సిక్సుల వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు.
గాయం కారణంగా ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్ పర్యటన తప్పుకున్న తర్వాత మైదానంలో అడుగుపెట్టలేదు. ఐపీఎల్‌లోనైనా అలరిస్తాడనుకుంటే అదీ వాయిదా పడింది. దీంతో అభిమానులకు నిరీక్షణ తప్పలేదు. ఈ నేపథ్యంలోనే అతడు సిక్సులు కొట్టడం మిస్సవుతున్నట్లు తన పోస్టులో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ప్రత్యర్థులపై సిక్సుల మోత మోగించిన వీడియోను పంచుకున్నాడు. దానికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. తాము కూడా రోహిత్ బ్యాటింగ్‌ను మిస్సవుతున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అతడిలాగే సిక్సులు మిస్సవుతున్నామని పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి: